గూగుల్ మీట్ సేవల్లో అంతరాయం – మీటింగ్‌లకు జాయిన్ కాలేక యూజర్ల ఇబ్బందులు

Users facing login and connectivity errors during a sudden Google Meet outage Users facing login and connectivity errors during a sudden Google Meet outage

Google Meet Down: గూగుల్ మీట్ సేవలు బుధవారం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఆన్‌లైన్ మీటింగ్‌లలో చేరడానికి ప్రయత్నించిన వేలాది మంది యూజర్లు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొన్నారు. outages ట్రాకింగ్ ప్లాట్‌ఫార్మ్ Downdetector.in ప్రకారం, గూగుల్ మీట్‌కు సంబంధించిన దాదాపు 2,000 ఫిర్యాదులు నమోదు అయ్యాయి.

యూజర్లు మీటింగ్‌లకు జాయిన్ కావడానికి ప్రయత్నించినప్పుడు “502. That’s an error. The server encountered a temporary error” అనే మెసేజ్ స్క్రీన్‌పై కనిపించింది.

ALSO READ:Safran Aerospace Hyderabad: తెలంగాణలో కొత్త ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం

సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు గూగుల్ మీట్ డౌన్ ఘటనను ఫన్నీ కామెంట్లతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. పని చేయాలన్న ఆసక్తి తగ్గేలోపు మీట్ క్రాష్ అయిందని ఒకరు కామెంట్ చేయగా, ఇంకొకరు సాధారణంగా తనకు దొరకని స్వేచ్ఛను ఈ అవుటేజ్ ఇచ్చిందని హాస్యంగా పేర్కొన్నారు.

కొంతమంది యూజర్లు తమ సంస్థలో ప్రతి ఒక్కరికి మీట్ పనిచేయకపోయినా, తమకు మాత్రం బాగా పనిచేస్తోందని తెలిపారు. కార్పొరేట్ ప్రపంచం ఈ అవుటేజ్‌తో ఎలా వ్యవహరిస్తుందోనంటూ మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు.

మీట్ సేవలు పాక్షికంగా పునరుద్ధరించబడుతున్నాయని పేర్కొంటూ యూజర్లు ఇంకా అనేక సమస్యలను రిపోర్ట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *