Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeUncategorizedGold Rates Today | బంగారం ధరల్లో ఒక్కసారిగా పతనం...నగరాల వారీగా తాజా రేట్లు

Gold Rates Today | బంగారం ధరల్లో ఒక్కసారిగా పతనం…నగరాల వారీగా తాజా రేట్లు

-

Chat on WhatsApp

Gold Rates Today : బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం పెరిగిన బంగారం ధరలు కొన్ని గంటల్లోనే తగ్గుముఖం పట్టాయి. గురువారం ఎగిసిన ధరలు శుక్రవారం అనూహ్యంగా పడిపోవడంతో మార్కెట్‌లో ఆసక్తికర పరిస్థితి నెలకొంది. దీని కారణంగా బంగారం కొనాలనుకునే వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది.

తాజా రేట్ల ప్రకారం, “హైదరాబాద్‌లో” 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛ బంగారం ధర ₹1,56,170కి పడిపోయింది. నిన్న ఈ ధర ₹1,56,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ₹320 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం నిన్న ₹1,43,450లో ఉండగా, ఇప్పుడు ₹1,43,150కు తగ్గింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా 22 క్యారెట్ల బంగారం ₹1,44,200 వద్ద ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,57,310కి పడిపోయింది, అంటే ₹870 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ₹1,44,200 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర ₹1,56,170, 22 క్యారెట్ల ధర ₹1,43,150 వద్ద ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే, ఢిల్లీలో కిలో వెండి ₹2.70 లక్షలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా అదే స్థాయి ఉంది. నిన్న వెండి ధర రూ.20,000 పెరిగినా, ఇవాళ తగ్గుదల కనిపించింది.

READ MORE:Ameerpet Fire Incident | అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం…

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp