టాలీవుడ్‌లో యువ హీరోలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి హిట్స్‌తో క్రేజ్‌ను సంపాదించాడు. కానీ ఇటీవల విడుదలైన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో ఆయన కెరీర్ కాస్త నెమ్మదించింది. ‘లైగర్’ సినిమా ఫెయిల్యూర్ తర్వాత విజయ్‌కు తిరిగి ట్రాక్‌లోకి రావడం కష్టంగా మారింది.
‘లైగర్’ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కించగా, ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బాలీవుడ్ మీడియా విజయ్‌ను భారీగా ప్రొజెక్ట్ చేసింది. సూపర్ స్టార్ అంటూ ప్రచారం చేయడం చూసిన బాలీవుడ్ జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండను పెద్ద స్టార్‌గా ఎవ్వరూ చూడరని, ఆయనను టైర్-2 హీరోగా మాత్రమే పరిగణిస్తారని ఆయన అన్నారు. బాలీవుడ్ మీడియా ఆయనను ఒక పాన్ ఇండియా స్టార్‌గా చూపించిందని… అది తనకు షాకింగ్ అనిపించిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
విజయ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన సినీ ప్రయాణం, విజయాలను గుర్తు చేస్తూ హిమేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. మరోవైపు, కొంతమంది మాత్రం నిజమేనని వ్యాఖ్యానిస్తున్నారు. బాలీవుడ్‌లోని అతిగా హైప్ వల్లే ‘లైగర్’ ఫెయిల్యూర్ ఎక్కువగా నెగటివ్‌గా మారిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.