Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కు వలస విధానాల విషయంలో మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులను మూడో దేశాలకు తరలించే ప్రభుత్వ నిర్ణయాన్ని యునైటెడ్ స్టేట్స్ జిల్లా న్యాయస్థానం మసాచుసెట్స్(Massachusetts federal court) తాత్కాలికంగా నిలిపివేసింది.
మసాచుసెట్స్‌కు చెందిన జిల్లా న్యాయమూర్తి బ్రియాన్ మర్ఫీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వలసదారులను వారికి సంబంధం లేని దేశాలకు పంపించడం చట్టవిరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ అక్రమ వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా నుంచి గ్వాటమాల, దక్షిణ సూడాన్, కోస్టారికా వంటి దేశాలకు వలసదారులను తరలించే చర్యలు చేపట్టారు.
అయితే తగిన గడువు ఇవ్వకుండా, న్యాయం పొందే అవకాశాన్ని కల్పించకుండా బలవంతంగా పంపిస్తున్నారని పలువురు వలసదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రభుత్వానికి పదిహేను రోజుల గడువు ఇచ్చింది. తాజా పరిణామం అమెరికా వలస విధానాలపై దేశవ్యాప్తంగా మళ్లీ విస్తృత చర్చకు దారితీసే అవకాశముంది.
READ MORE:చట్టాన్ని సవాల్ చేస్తే ఇంతే: అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఇక ఆ వీడియోలు కనిపించవు!








