Kaza Toll Plaza: గుంటూరు జిల్లాలో ఉన్న కాజా టోల్ ప్లాజా వద్ద టోల్ వసూళ్ల ప్రక్రియలో తీవ్ర అంతరాయం నెలకొంది. సాంకేతిక సమస్యల కారణంగా టోల్ చెల్లింపులు ఆలస్యమవుతూ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టోల్ చెల్లింపుకు సాధారణంగా కొన్ని క్షణాలే పట్టాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కో వాహనానికి సుమారు పది నిమిషాల వరకు సమయం పడుతోందని డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల క్యూలు ఏర్పడి రాకపోకలు నెమ్మదించాయి.
గత వారం రోజులుగా సర్వర్ సమస్యలు( Fastag server problem) కొనసాగుతున్నప్పటికీ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా ఫాస్టాగ్ స్కానర్లు సరిగా స్పందించకపోవడంతో ప్రతి వాహనాన్ని మాన్యువల్‌గా పరిశీలించాల్సి వస్తోందని సమాచారం.
దీనివల్ల ప్రయాణికులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
READ MORE:డోనాల్డ్ ట్రంప్ కు షాక్….అక్రమ వలసదారుల తరలింపుపై ఫెడరల్ కోర్టు స్టే








