Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeNationalDelhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గాలుల బీభత్సం.. మూడు విమానాలు ధ్వంసం

Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గాలుల బీభత్సం.. మూడు విమానాలు ధ్వంసం

-

Chat on WhatsApp

Delhi Airport: ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టెర్మినల్-2 వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పడిన తీవ్ర వాతావరణ పరిస్థితులు విమాన సర్వీసులపై ప్రభావం చూపాయి. ఆకస్మికంగా వీచిన బలమైన ఈదురు గాలులు, వర్షం కారణంగా మూడు ఎయిర్ ఇండియా విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో విమానాశ్రయ పరిసరాల్లో ఉన్న గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు నియంత్రణ తప్పినట్లు సమాచారం.

ఈ పరికరాలు గాలుల వేగానికి తట్టుకోలేక పార్క్ చేసిన విమానాలను ఢీకొన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో కొన్ని విమానాలకు నిర్మాణపరమైన నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో బలమైన గాలుల కారణంగా పరికరాలు రన్‌వేపై జారుకుంటూ వెళ్తూ కనిపించాయి. వాటిని నిలిపేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించిన దృశ్యాలు కూడా అందులో నమోదయ్యాయి.

ఈ ఘటన విమానాశ్రయ భద్రతా వ్యవస్థపై చర్చకు దారితీసింది. దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలను తాత్కాలికంగా సేవల నుంచి తొలగించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ముందస్తు హెచ్చరికలు అందలేదని కూడా అధికారులు తెలిపారు.

ఎయిర్ ఇండియా ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా వాతావరణం తీవ్ర మార్పులకు లోనవుతోంది. తుపానులు, ఉరుములు, బలమైన గాలులు ప్రజా జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగవచ్చని సూచనలున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp