ఆఫ్రికా దేశం కాంగో (DRC)లో గనుల శాఖ మంత్రి తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంత్రి లూయి వాటమ్ కబాంబ ప్రయాణిస్తున్న విమానం, ల్యాండింగ్ సమయంలో కోల్వేజీ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి జారిపోయి పక్కకు వెళ్లి ఆపై మంటల్లో చిక్కుకుంది.
అయితే, పైలట్లు వేగంగా స్పందించడంతో మంత్రి సహా 20 మంది ప్రయాణికులందరూ విమానం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు.
ALSO READ:iBomma Ravi Backstory: భార్య,అత్త హేళనతో పైరసీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన
ఈ ఘటన ప్రత్యేకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కారణం మంత్రి శనివారం లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో రాగి గనిలో జరిగిన వంతెన కూలిన ఘటనను పరిశీలించడానికి అక్కడికి బయలుదేరడం. ఆ ప్రమాదంలో 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
కాంగోలో రాగి గనులు లక్షలాది మందికి జీవనాధారం అయినప్పటికీ, భద్రతా ప్రమాణాలు బలహీనంగా ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండటం స్థానికుల ఆందోళనకు కారణమవుతోంది.
