Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadiBomma Ravi Backstory: భార్య,అత్త హేళనతో పైరసీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన  

iBomma Ravi Backstory: భార్య,అత్త హేళనతో పైరసీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన  

-

Chat on WhatsApp

ఈ పైరసీ చేసింది వాళ్ళ ఇద్దరి ఒత్తిడితోనే ఐ బొమ్మ రవి అసలు కథ.తెలుగు సినీ పరిశ్రమను సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టుతున్న పైరసీ వెబ్‌సైట్ “iBomma” నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అవడంతో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

ఇటీవల పోలీసులకు సవాల్ విసిరిన రవిని హైదరాబాద్‌కు వచ్చేసరికి కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని నేరప్రస్థానానికి కారణమైన వ్యక్తిగత కథ బయటపడింది.

2016లో ప్రేమ వివాహం చేసుకున్న రవి వెబ్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. అయితే, సంపాదన తక్కువగా ఉందని భార్య, అత్తగారి హేళన అతడిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. డబ్బు సంపాదించాలనే కసితో తన టెక్నికల్ నైపుణ్యాన్ని ఉపయోగించి “iBomma”, “BappamTV” వంటి పైరసీ వెబ్‌సైట్లను రూపొందించాడు.

ALSO READ:Vaaranasi Movie Title Issue: రాజమౌళి–మహేశ్ బాబు ఫిల్మ్‌పై  ఫిర్యాదు 

కొద్ది కాలంలోనే ఈ సైట్లకు బెట్టింగ్ యాప్‌ల నుంచి భారీగా ప్రకటనలు వచ్చి లక్షల రూపాయల ఆదాయం రావడం మొదలైంది.

అయినా వ్యక్తిగత జీవితం సర్దుకోలేదు. భార్యతో విభేదాలు మరింత పెరగడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం రవి నెదర్లాండ్స్‌కు వెళ్లి అక్కడి నుంచే పైరసీ కార్యకలాపాలను నడిపాడు.

సుమారు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్లకు అమ్మి రూ.20 కోట్లు ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్ అమ్ముకుని విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడాలని యోచిస్తున్న సమయంలోనే పోలీసులు అతడిని పట్టుకున్నారు.

నగర సీపీ సజ్జనార్ హెచ్చరిస్తూ చట్టానికి సవాల్ విసిరే నేరస్థుడు ఎవరైనా జైలుకే వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఉచిత సినిమాల వెనుక డేటా దోపిడీ ప్రమాదం ఉంటుందనీ, పైరసీ సైట్లను ప్రజలు వాడరాదని సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

NEET Protests Explained: Why CJP's Delhi Agitation Sparked Controversy

NEET Controversy | నీట్ నిరసనలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి? అసలు ఏం జరిగింది?

NEET Controversy: నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర...
- Advertisement -
Chat on WhatsApp