Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeTelanganaCM Revanth Reddy  | జనావాసాల మధ్యే ఇందిరమ్మ ఇళ్లు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy  | జనావాసాల మధ్యే ఇందిరమ్మ ఇళ్లు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

-

Chat on WhatsApp

CM Revanth Reddy: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా (CURE) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నిరుపేదలకు కేటాయించే ఇళ్లు నగరానికి దూరంగా కాకుండా, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండే జనావాసాల మధ్యే నిర్మించాలని అధికారులను స్పష్టం చేశారు. ఇందుకోసం ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వినియోగంలో లేని స్థలాలను గుర్తించాలని సూచించారు. అవసరమైతే పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల ఖాళీ భూములను వినియోగించి, వాటికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని ఆదేశించారు.

క్యూర్ పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశలో 7,680 ఇందిరమ్మ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక్కో ఫ్లాట్‌ను 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం సుమారు రూ.11 లక్షలు కాగా, అందులో రూ.5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. భూమి వ్యయాన్ని మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. 17 నియోజకవర్గాల పరిధిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఖరారు చేయాలని సీఎం సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Kiran Abbavaram and Sri Gouri Priya in Chennai Love Story movie

Chennai Love Story | ‘చెన్నై లవ్ స్టోరీ’కి గ్రాండ్ స్టార్ట్.. ప్రీమియర్స్‌తోనే రూ.3.13...

Chennai Love Story: తెలుగు సినీ పరిశ్రమలో రిలీజ్‌కు ముందే ఓ తెలుగు ప్రేమకథా చిత్రం భారీ హైప్‌తో వార్తల్లో నిలుస్తోంది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ'...
- Advertisement -
Chat on WhatsApp