Saturday, August 1, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshBhogapuram Airport | ఘనంగా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం .. మోడీకి బొబ్బిలి వీణ బహుమతి

Bhogapuram Airport | ఘనంగా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం .. మోడీకి బొబ్బిలి వీణ బహుమతి

-

Chat on WhatsApp

Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి మోడీ ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సుమారు 2,703 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని స్వయంగా పరిశీలించి అక్కడి సౌకర్యాలను తెలుసుకున్నారు.

విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించేందుకు వేదికపైకి చేరుకోగా, వేలాదిగా హాజరైన ప్రజలు ఘన స్వాగతం పలికారు. సభలో మరో ప్రత్యేక ఆకర్షణగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణ(Bobbili Veena)ను కానుకగా అందించారు. ఈ అపురూప బహుమతిని ప్రధాని స్వీకరించగా, వేదికపై ఉన్న ప్రముఖులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ దృశ్యం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు మరింత ఊతం లభించడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ అనుసంధానం మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

FIEO to Conduct Two-Day Export Business Training Program in Hyderabad

FIEO | అంతర్జాతీయ మార్కెట్‌లో అడుగు పెట్టాలనుకునే వారికీ గోల్డెన్ ఛాన్స్.. ఫియో సర్టిఫికెట్...

FIEO: అంతర్జాతీయ మార్కెట్‌ ఎగుమతి రంగంలో వ్యాపారాన్ని రాణించాలని భావిస్తున్న పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, యువ వ్యాపారులకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) శుభవార్త చెప్పింది. "Export Opportunities – How to Start...
- Advertisement -
Chat on WhatsApp