Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(Bhogapuram Airport) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది చారిత్రాత్మక రోజని అన్నారు. ఒకప్పుడు ఎర్ర బస్సు కూడా రాదని భావించిన ప్రాంతం నుంచి నేడు అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport) నిర్మాణం కావడం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెక్కలు ఇచ్చారని కొనియాడారు.
దేశ అభివృద్ధికి మోడీ నాయకత్వం దిశానిర్దేశం చేస్తోందని పేర్కొన్న లోకేశ్, “నమో అంటే నమ్మకం.. నమో అంటే సురక్షిత భారత్” అని వ్యాఖ్యానించారు. సుమారు 2,703 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విమానాశ్రయం ప్రారంభంతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ అనుసంధానం మరింత పెరుగుతాయని, ఉత్తరాంధ్ర దేశంలోని ప్రముఖ అభివృద్ధి కేంద్రంగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: Bhogapuram Airport | ఘనంగా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం .. మోడీకి బొబ్బిలి వీణ బహుమతి








