CM Chandrababu: రాష్ట్రంలో ఈ ఏడాది నీటి లభ్యతపై అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎల్ నినో ప్రభావం(El Nino impact) కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు గతంతో పోలిస్తే భిన్నంగా మారుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం చీకటి, విధ్వంస పరిస్థితులను ఎదుర్కొందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ సహకారంతో జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు రావడం వల్ల ప్రజలకు, వ్యాపార రంగానికి ఊరట లభించిందని సీఎం చెప్పారు. రాష్ట్రానికి కీలకమైన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయని వెల్లడించారు.
పోలవరం(PolaHomevaram) ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.








