AP Governor: హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను గవర్నర్ పరామర్శించి, ఆరోగ్యంపై ఆరా తీశారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్న తీరుపై వైద్యుల సూచనలు తెలుసుకుని, వాటిని కచ్చితంగా పాటించాలని సూచించారు.
వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌కు కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో కొన్ని వారాల తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభం కానుందని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కొంత సమయం అవసరమని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ALSO READ: Mamata Banerjee | టీఎంసీకి మరో షాక్.. రాజీనామా చేసిన రుక్మిణి మల్లిక్








