CJI Surya Kant: భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యాయమూర్తిగా ఆయనను ప్రమాణం చేయించారు. ఆయన ఈ పదవిలో 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నారు. సీజేఐ బాధ్యతలు చేపడుతున్న తొలి హరియాణా వాసిగా జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant) ప్రత్యేక గుర్తింపు పొందారు.
1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిస్సార్ జిల్లాలో జన్మించిన సూర్యకాంత్ న్యాయ రంగంలో విశిష్ట సేవలు అందించారు. పంజాబ్–హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా, తరువాత హిమాచల్ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా వివిధ కీలకభాద్యతలు నిర్వర్తించారు.
ALSO READ:AP Weather Alert: రైతులకు కీలక హెచ్చరిక…అండమాన్లో తీవ్ర అల్పపీడనం
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు పరిపాలన, న్యాయవ్యవస్థ సంస్కరణల్లో ఆయన కొత్త దిశ చూపుతారని న్యాయవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
