Saturday, August 1, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshCBN@361 Degrees | అంతర్జాతీయ వేదికపై చంద్రబాబు పుస్తకావిష్కరణ

CBN@361 Degrees | అంతర్జాతీయ వేదికపై చంద్రబాబు పుస్తకావిష్కరణ

-

Chat on WhatsApp

సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, తన నాయకత్వంపై రూపొందిన ‘CBN@361 Degrees – Polymath’ పుస్తకావిష్కరణ చేశారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా పుస్తక తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర మంత్రి పి. నారాయణతో పాటు అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ పుస్తకాన్ని ‘రేపటి కోసం’ దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలో అనువదించారు.

సీఎం చంద్రబాబు పాలనా విధానం, అభివృద్ధి దృష్టికోణం, దీర్ఘకాలిక ప్రణాళికలు, విజన్ ఆధారిత నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకం రూపొందించబడింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుల తరహాలో చంద్రబాబు కూడా ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటున్నారని రచయిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతి రాజధాని నిర్మాణంపై ఆయన చూపుతున్న ప్రత్యేక దృష్టి కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించబడింది.

కార్యక్రమంలో భాగంగా సింగపూర్ వ్యవస్థాపక నేత లీ క్వాన్ యూ శతజయంతి సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వెండి నాణేన్ని కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు బహూకరించారు.

ఈ పుస్తకాన్ని త్వరలో తెలుగు, హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో విడుదలైన ‘Chandrababu X.0’ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని, లక్షలాది మంది డిజిటల్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు.

‘CBN@361 Degrees’ పుస్తకం రాజకీయ విశ్లేషకులు, మేనేజ్‌మెంట్ విద్యార్థులు, నాయకత్వ అధ్యయనాల్లో ఆసక్తి ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

India Condemns Pakistan Army Over Reported Civilian Killings in PoK

PoK | శాంతియుత నిరసనలపై కాల్పులు.. పాక్ చర్యలపై భారత్ ఆగ్రహం

PoK: పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన ప్రజలపై కాల్పులు జరపడం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొంది. ఈ ఘటనలపై...
- Advertisement -
Chat on WhatsApp