తెలంగాణ అభివృద్ధికి బీసీల స్థిరాభివృద్ధి కీలకం – ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా 42% రిజర్వేషన్ కేటాయిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ తెలిపారు. బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను దేశం మొత్తం గర్వపడేలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కుల గణనను సమర్థవంతంగా నిర్వహించి, మిగిలిపోయిన వర్గాలను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు బీసీలను, బహుజనులను నిర్లక్ష్యం…
