Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTRam Charan Peddi | రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పెద్ది’ బుకింగ్స్ ఓపెన్ ?

Ram Charan Peddi | రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పెద్ది’ బుకింగ్స్ ఓపెన్ ?

-

Chat on WhatsApp

Ram Charan Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదలపై నెలకొన్న సందేహాలకు ఎట్టకేలకు ముగింపు లభించింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపించినా, అవన్నీ కేవలం ప్రచారమేనని తాజా సమాచారం స్పష్టం చేస్తోంది.

‘పెద్ది’ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావడం ఖాయమైందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో రిలీజ్ డేట్ లేకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు పెరిగాయి.

అయితే, ప్రస్తుతం ఒక ఐటెం సాంగ్ మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని, రీ-రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. మరో వారంలో ఈ పనులన్నీ ముగిసే అవకాశం ఉందని సమాచారం.

ఇక ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8న ఓపెన్ కానున్నాయి. విదేశీ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే ఏప్రిల్ 30 రిలీజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రమోషన్స్ ప్రారంభించగా, రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు, మిగిలిన ప్యాచ్‌వర్క్, ఐటెం సాంగ్ షూట్‌ను వేగంగా పూర్తి చేసేందుకు చిత్రబృందం కసరత్తు చేస్తోంది. ‘పెద్ది’ విడుదల ఖరారవడంతో, అదే సమయంలో రానున్న ఇతర సినిమాల విడుదల తేదీలపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి, రామ్ చరణ్ అభిమానులకు ఇది పెద్ద ఊరట ఇచ్చే అప్డేట్‌గా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp