Railway cable wires burnt | వేటపాలెం రైల్వే స్టేషన్ వద్ద కేబుల్ వైర్లు దగ్ధం

Burnt railway cable wires near Vetapalem Railway Station Burnt railway cable wires near Vetapalem Railway Station

బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో కేబుల్ వైర్లు దగ్ధమై(Railway cable wires burnt) ఉద్రిక్తత నెలకొంది. రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఉన్న కేబుల్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తి సాయంత్రం సమయంలో నిప్పుపెట్టినట్లు ప్రాథమిక సమాచారం.

ఘటనను స్థానికులు గమనించడంతో వెంటనే రైల్వే గార్డ్‌కు సమాచారం ఇచ్చారు.తర్వాత రైల్వే గార్డ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించాడు. అనంతరం ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయగా, రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని దగ్ధమైన వైర్లను పరిశీలించారు.

ALSO READ: India vs South Africa 1st Test: బుమ్రా గర్జన – కుప్పకూలిన దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్  

వైర్లు ఎప్పుడు, ఏ విధంగా దగ్ధమయ్యాయనే అంశంపై రైల్వే భద్రతా విభాగం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.ఇటీవలి కాలంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో కొందరు ఆకతాయిలు మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే పరిధిలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని వారు అధికారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *