Sunday, March 8, 2026
No menu items!
Google search engine
HomeTelanganaRajanna Sircilla | BRS కౌన్సిలర్ సహకారంతో వృద్ధురాలికి అంత్యక్రియలు

Rajanna Sircilla | BRS కౌన్సిలర్ సహకారంతో వృద్ధురాలికి అంత్యక్రియలు

- Advertisement -
Google search engine

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో వృద్ధురాలు మామిడాల వీరమ్మ (80) మృతి చెందారు. ఆమె కొడుకు బాలరాజ్‌తో కలిసి మార్కండేయ వీధిలోని ఇంట్లో జీవించేది. బాలరాజ్ టెక్స్టైల్ పార్కులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరమ్మ పెద్ద కొడుకు పాండు, భర్త విశ్వనాథం ఇప్పటికే మృతిచెందారు.

బాలరాజు భార్యతో వేరుగా ఉంటూ తల్లి వీరమ్మను చూసుకుంటున్నాడు. మృతదేహం గురుంచి ఇంటి యజమానికి తెలుపగా, యజమాని ఇంట్లోకి తీసుకోవడానికి నిరాకరించి రోడ్డుపై ఉంచమని ఆదేశించాడు. దీంతో, రోడ్డుపై ఓ బల్లపై మృతదేహాన్ని ఉంచారు. నిరుపేద కుటుంబం కావడంతో అంతక్రియలకు కూడా నిధులు లేవని బాలరాజు విలపించాడు.

మృతదేహం రోడ్డుపై ఉండటం, బంధువుల నిరసనలు, ధైన్య పరిస్థితిని స్థానికులు చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ అడిచెర్ల రూప సాయికుమార్‌ దృష్టికి చేరింది.

ఆయన వీరమ్మ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతక్రియలను స్వయంగా నిర్వహిస్తామని, ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటామని మనో ధైర్యం ఇచ్చారు.

ALSO READ:Toyota Fortuner | 2026 టయోటా ఫార్చ్యూనర్ స్పై ఫోటోలు లీక్…కొత్త డిజైన్‌తో SUV కింగ్ రెడీ!

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular