Wednesday, April 15, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsToyota Fortuner | 2026 టయోటా ఫార్చ్యూనర్ స్పై ఫోటోలు లీక్...కొత్త డిజైన్‌తో SUV కింగ్...

Toyota Fortuner | 2026 టయోటా ఫార్చ్యూనర్ స్పై ఫోటోలు లీక్…కొత్త డిజైన్‌తో SUV కింగ్ రెడీ!

-

Chat on WhatsApp

Toyota Fortuner: 2026 మోడల్‌కు సంబంధించిన స్పై ఫోటోలు బయటకు రావడంతో టయోటా (Toyota) అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. థాయిలాండ్‌లో టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కొత్త “Toyota Fortuner” పూర్తిగా కవరింగ్‌లో ఉన్నప్పటికీ, ఇది సాధారణ ఫేస్‌లిఫ్ట్ కాదని, పూర్తి స్థాయి జనరేషన్ అప్‌డేట్ అని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.

2004లో గ్లోబల్‌గా పరిచయమైన ఫార్చ్యూనర్, భారత్‌లో 2009లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలుగా SUV సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. బలమైన నిర్మాణం, రోడ్డు ప్రెజెన్స్, నమ్మకమైన పనితీరుతో ఎప్పుడూ టాప్ ఎంపికగా నిలిచింది. ఇప్పుడు 2026 వెర్షన్‌లో మరింత అగ్రెసివ్ డిజైన్ రానుందని సమాచారం.

హైలక్స్ స్టైల్ డిజైన్

కొత్త మోడల్ లుక్ విషయంలో “Toyota Hilux” స్టైల్ ప్రభావం కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. పెద్ద హెక్సాగనల్ గ్రిల్, హనీకోంబ్ ప్యాటర్న్, స్లిమ్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, LED DRLs, మస్క్యులర్ బంపర్ డిజైన్ వంటి అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండొచ్చు.

ఇంటీరియర్ & ఫీచర్లు

ఇంటీరియర్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ చార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్యానోరమిక్ సన్‌రూఫ్, OTA అప్‌డేట్స్ వంటి ఆధునిక ఫీచర్లు అందించే అవకాశముంది.

ADAS & మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ

సేఫ్టీ పరంగా Toyota Safety Sense ప్యాకేజ్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ అవాయిడెన్స్ వంటి ADAS ఫీచర్లు జోడించవచ్చు. ఇంజిన్ ఆప్షన్లలో ప్రస్తుతం ఉన్న 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ టర్బో డీజిల్ కొనసాగుతాయని, తర్వాత దశలో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

మొత్తానికి 2026 ఫార్చ్యూనర్ మరింత స్టైల్, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతో SUV మార్కెట్‌లో మరోసారి సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది.

also read:Liquor Scam | అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Kavya Maran smiling and accepting a rose from a fan after SRH victory at Uppal Stadium

Kavya Maran | అభిమానితో క్యూట్ మూమెంట్.. గులాబీ పువ్వును తీసుకున్న కావ్యా మారన్

Kavya Maran: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఉత్సాహపరిచింది. ఈ విజయంతో...
- Advertisement -
Chat on WhatsApp