Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeNationalఅయోధ్య రామ మందిర ట్రస్ట్‌లో కీలక మార్పు.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎవరంటే ?

అయోధ్య రామ మందిర ట్రస్ట్‌లో కీలక మార్పు.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎవరంటే ?

-

Chat on WhatsApp

Ayodhya Ram Mandir Trust: రామ మందిర విరాళాల లెక్కలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక బాధ్యతల్లో మార్పులు చేపట్టింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ వైదొలగిన నేపథ్యంలో, ఆ బాధ్యతలను తాత్కాలికంగా కృష్ణమోహన్‌కు అప్పగించింది. ట్రస్ట్ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం.

ఈ నియామకంలో ప్రత్యేకత ఏమిటంటే, విరాళాల లెక్కల్లో అవకతవకలు ఉన్నాయనే అనుమానాన్ని మొదట అధికారికంగా వ్యక్తం చేసి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా కృష్ణమోహనే కావడం. ఆలయ హుండీ ఆదాయం, విరాళాల నిర్వహణలో లోపాలు ఉన్నాయనే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకురావడంతో విచారణకు మార్గం సుగమమైంది. కృష్ణమోహన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా విచారణ చేపట్టి విరాళాల వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో పరిపాలనా వ్యవహారాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్‌ను నియమించింది. పూర్తి స్థాయి విచారణ ముగిసిన అనంతరం, ట్రస్ట్ నిబంధనల ప్రకారం శాశ్వత ప్రధాన కార్యదర్శి ఎంపిక చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం అయోధ్య రామ మందిర ట్రస్ట్ వ్యవహారాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలిస్తున్నదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp