Arjun Tendulkar wedding: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వ్యాపార రంగానికి చెందిన సానియా చందోక్ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ముంబైలో జరిగిన ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, క్రీడా మరియు సినీ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో కొత్త దంపతులు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
గత సంవత్సరం ఆగస్టు 25న అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ల నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత మార్చి ప్రారంభం నుంచి పెళ్లి వేడుకలకు సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి టెండూల్కర్ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో సంగీత్, హల్దీ వంటి కార్యక్రమాలు సందడిగా జరిగాయి.
ఈ శుభ వేడుకకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) తన భార్య సాక్షి ధోని (Sakshi Dhoni) తో కలిసి హాజరయ్యారు. అలాగే క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రాహుల్ గాంధీ, అనిల్ కుంబ్లే (Anil Kumble), రవి శాస్త్రి (Ravi Shastri) కొత్త జంటను ఆశీర్వదించారు.
టీమిండియా ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంబీర్ (Gautam Gambhir)తో పాటు మాజీ ఆల్రౌండర్, రాజకీయ నాయకుడు యూసుఫ్ పఠాన్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. క్రీడా రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఈ వివాహ వేడుక మరింత ప్రత్యేకంగా నిలిచింది.









