HomeAndhra PradeshAcademic calendar 2026-27 | స్కూల్ క్యాలెండర్ 2026-27: పరీక్షల తేదీలు, సెలవుల పూర్తి వివరాలు

Academic calendar 2026-27 | స్కూల్ క్యాలెండర్ 2026-27: పరీక్షల తేదీలు, సెలవుల పూర్తి వివరాలు

-

Chat on WhatsApp

Academic calendar 2026-27: 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు మొత్తం 87 రోజుల సెలవులు ఉండనున్నాయి. అదనంగా ఐదు ఐచ్ఛిక సెలవులు, స్థానిక పండుగలు, జాతరల కోసం మూడు ప్రత్యేక సెలవులు ఇవ్వనున్నారు.

మొత్తం 229 పని రోజుల పాటు పాఠశాలలు నిర్వహించబడతాయి. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, వారి సూచనల ఆధారంగా క్యాలెండర్ రూపొందించామని అధికారులు తెలిపారు.

ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 24 పీరియడ్లు బోధించాలి, గరిష్ఠంగా 30 పీరియడ్లు మించకూడదని మార్గదర్శకాలు జారీ చేశారు. అవసరమైతే ఫిజిక్స్ ఉపాధ్యాయులు గణితం బోధించేలా చర్యలు తీసుకోనున్నారు.

జూన్‌లో పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థుల ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా నిర్వహించి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

తరగతి సంసిద్ధత కార్యక్రమాలు కూడా అమలు చేయనున్నారు. 1, 2, 6 తరగతులకు జూన్ 12 నుంచి ఆగస్టు 3 వరకు, 3 నుంచి 8 తరగతులకు జూన్ 12 నుంచి 30 వరకు కార్యక్రమాలు ఉంటాయి. సెలవుల విషయానికి వస్తే, దసరా సెలవులు అక్టోబర్ 12 నుంచి 21 వరకు ఉండగా, మైనారిటీ పాఠశాలలకు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి.

క్రిస్మస్ సందర్భంగా మైనారిటీ పాఠశాలలకు డిసెంబర్ 20 నుంచి 27 వరకు, సాధారణ పాఠశాలలకు డిసెంబర్ 25న సెలవు ఉంటుంది. సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుంచి 17 వరకు ఉంటాయి.

పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఫార్మేటివ్, సమ్మెటివ్ పరీక్షలతో పాటు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 15 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. ఈ క్యాలెండర్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్పష్టమైన ప్రణాళిక లభిస్తుందని అధికారులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp