Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalఅమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ విపరీత పరిణామాలు

అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ విపరీత పరిణామాలు

-

Chat on WhatsApp

అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ ప్రభావం ఉపగ్రహం కంటికి చిక్కింది. ఈ తుపాను పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తూ తీవ్రత చూపుతోంది. ఉపగ్రహం ఈ అద్భుతమైన దృశ్యాన్ని చిత్రీకరించింది, ఇందులో తుపాను భయంకరంగా సుడులు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది.

తుపాను కారణంగా వాషింగ్టన్‌లోని లిన్‌వుడ్‌లో చెట్లు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలు, విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం ఆరు లక్షల ఇళ్లపై పడింది.

వాషింగ్టన్, ఓరెగావ్, కాలిఫోర్నియాలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి, స్కూళ్లు మూతపడ్డాయి. ఈ తుపాను ప్రభావం పశ్చిమ, వాయవ్య అమెరికాలో దారుణ పరిస్థితులను సృష్టించింది. ‘బాంబ్ సైక్లోన్’ ప్రభావం కెనడా, బ్రిటిష్ కొలంబియాపైనా పడింది. కెనడాలోని పసిఫిక్ తీర ప్రాంతంలో 2.25 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp