Tuesday, August 4, 2026
Chat on WhatsApp
HomeNationalNEET UG Counselling | నేటి నుంచి MBBS కౌన్సెలింగ్.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

NEET UG Counselling | నేటి నుంచి MBBS కౌన్సెలింగ్.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

-

Chat on WhatsApp

NEET UG Counselling: నీట్‌-యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు కీలక అప్డేట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతోంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఆధ్వర్యంలో 15 శాతం అఖిల భారత కోటా (AIQ) కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుడుతుండగా, ఆగస్టు 13 నుంచి 85 శాతం రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రెండు కోటాల్లోనూ మూడు ప్రధాన రౌండ్లతో పాటు చివరగా స్ట్రే వెకెన్సీ రౌండ్ నిర్వహించి మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు ముందుగానే అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నీట్ ర్యాంకు, గత ఏడాది కటాఫ్‌లు, కళాశాలల ఫీజులు, బాండ్ నిబంధనలు, హాస్టల్ సౌకర్యాలు, కాలేజీ గుర్తింపు వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని చెబుతున్నారు. వెబ్ ఆప్షన్ల సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, అవకాశం రాదనే భావనతో మంచి కళాశాలలను వదిలేయకుండా అత్యంత ఇష్టమైన కాలేజీని మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేయాలని సూచిస్తున్నారు.

సీట్ల కేటాయింపు పూర్తిగా అభ్యర్థి ఇచ్చిన ప్రాధాన్యత క్రమం ఆధారంగానే జరుగుతుంది. AIQ, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ వేర్వేరు ప్రక్రియలు కావడంతో రెండింటికీ అర్హులైన వారు తప్పనిసరిగా రెండింటిలోనూ నమోదు చేసుకోవాలి. ప్రతి రౌండ్‌లో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉండటంతో సీటు రాకపోయినా తదుపరి రౌండ్లలో పాల్గొనడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

E20 Petrol Quality Check: Government Clarifies Fuel Standards and Safety Measures

E20 పెట్రోల్ సేఫేనా?.. కేంద్రం చెప్పిన కీలక విషయాలు ఇవే

E20 Petrol Quality Check: E20 పెట్రోల్‌పై నెలకొన్న అపోహలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు అందించే ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చమురు సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని...
- Advertisement -
Chat on WhatsApp