Commonwealth Games: గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. ఒకే రోజు రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ముందుగా మహిళల 54 కేజీల విభాగం ఫైనల్లో 22 ఏళ్ల ప్రీతి పవార్(Preeti Pawar) కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోపై 5-0 తేడాతో ఏకగ్రీవ విజయాన్ని నమోదు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మొదటి రౌండ్ నుంచే దూకుడుగా ఆడిన ప్రీతి పవార్ వరుస పంచ్‌లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి పాల్గొనుగానే స్వర్ణం గెలిచి భారత బాక్సింగ్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ విజయంతో బాక్సింగ్ విభాగంలో భారత్ తొలి స్వర్ణాన్ని అందుకుంది.
ప్రీతి విజయం అనంతరం మహిళల 57 కేజీల విభాగం ఫైనల్లో 24 ఏళ్ల జైస్మిన్ లాంబోరియా(Jaismine Lamboria) కూడా అద్భుత ఆటతీరుతో మెరిసింది. నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ మైఖేలా వాల్ష్‌ను ఓడించి మరో స్వర్ణ పతకాన్ని భారత్ ఖాతాలో జమ చేసింది. వరుసగా రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన భారత మహిళా బాక్సర్లు కామన్వెల్త్ వేదికపై దేశ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి చేర్చారు.
ALSO READ: SRSP Project | ఎస్సారెస్పీని సందర్శించిన మంత్రి ఉత్తమ్.. సాగునీటి విడుదలపై రెండు రోజుల్లో నిర్ణయం








