PoK: పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన ప్రజలపై కాల్పులు జరపడం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొంది. ఈ ఘటనలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించి, పాకిస్థాన్‌ను జవాబుదారీగా నిలబెట్టాలని భారత్ పిలుపునిచ్చింది. స్థానిక మానవ హక్కుల సంఘాలు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, జూలై 27, 28 తేదీల్లో రావల్కోట్, మీర్పూర్, కోట్లి, ముజఫరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు శాంతియుతంగా లాంగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ఆరోపించారు. ఈ ఘటనల్లో 40 మందికి పైగా నిరసనకారులు మరణించగా, 400 మందికిపైగా గాయపడినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వందలాది మందిని అరెస్ట్ చేసి జైళ్లకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాక్ సైన్యం తమ చర్యలను దాచిపెట్టేందుకు ఆసుపత్రులు, వీధుల నుంచి మృతదేహాలను బలవంతంగా తరలించిందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల పరిస్థితిపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణ జరగాలని కోరింది. అయితే ఈ ఆరోపణలపై పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ALSO READ: Rashmika Mandanna | రశ్మిక మందన్నకు తీవ్ర గాయం.. షూటింగ్స్‌కు బ్రేక్!








