Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeNationalIndian Railways | Tatkal Ticket Booking కొత్త రూల్స్.. ఇక గంటల తరబడి వెయిటింగ్‌కు...

Indian Railways | Tatkal Ticket Booking కొత్త రూల్స్.. ఇక గంటల తరబడి వెయిటింగ్‌కు గుడ్‌బై!

-

Chat on WhatsApp

Indian Railways: రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు పశ్చిమ మధ్య రైల్వే (West Central Railway – WCR) ఆగస్టు 1 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడం, దళారుల జోక్యాన్ని నియంత్రించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు.

ప్రస్తుతం టోకెన్ తీసుకున్న ప్రయాణికులు తత్కాల్ బుకింగ్ ప్రారంభమయ్యే వరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అనంతరం మళ్లీ రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి టికెట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త విధానంలో ఈ ఇబ్బంది తొలగి, బుకింగ్ ప్రారంభమైన వెంటనే టికెట్ పొందే అవకాశం కల్పించనున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఏసీ తత్కాల్ టికెట్ల బుకింగ్ ఉదయం 8:30 నుంచి 9:00 గంటల వరకు, నాన్-ఏసీ (స్లీపర్ సహా) తత్కాల్ టికెట్ల బుకింగ్ 9:00 నుంచి 9:30 గంటల వరకు నిర్వహించనున్నారు. దీంతో ప్రయాణికులు ఒకేసారి టికెట్ బుకింగ్ పూర్తి చేసుకునే వీలు ఉంటుంది.

అంతేకాదు, దళారుల కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రతి రిజర్వేషన్ కౌంటర్‌లో గరిష్టంగా ఏసీకి 10 టికెట్లు, నాన్-ఏసీకి 15 టికెట్లు మాత్రమే బుక్ చేసే పరిమితిని అమలు చేయనున్నారు. ఈ మార్పులతో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గడంతో పాటు, సాధారణ ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు మరింత సులభంగా లభించే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

BMW Offers Voluntary Retirement to 40,000 Employees Amid Global Cost-Cutting

BMW | లాభాలు తగ్గడంతో BMW కఠిన నిర్ణయం.. వేల ఉద్యోగాలకు గుడ్‌బై

ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం BMW కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వ్యయాలు, చైనా మార్కెట్‌లో అమ్మకాలు పడిపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో లాభాలు తగ్గడంతో జర్మనీలో వేలాది మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ...
- Advertisement -
Chat on WhatsApp