Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeNationalCJI Suryakant | శాంతియుత నిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

CJI Suryakant | శాంతియుత నిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

CJI Suryakant: ప్రజాస్వామ్యంలో నిరసనలకు ఉన్న ప్రాధాన్యతను సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని పేర్కొంటూ, నిరసనల సమయంలో పోలీసులు వ్యవహరించే తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల ఆందోళన సందర్భంగా అధిక బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

నీట్‌-యూజీ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో సమస్యలు, ఉద్యోగ అవకాశాలపై డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జూలై 20న ‘చలో సంసద్’ కార్యక్రమం నిర్వహించారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని, టియర్ గ్యాస్, ఇతర బలప్రయోగ పద్ధతులు ఉపయోగించారని ఆరోపిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ కేసును చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. నిరసన చేయడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆందోళన జరుగుతోందనే కారణంతోనే పోలీసులు అధిక బలాన్ని ప్రయోగించడం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించారు.

పోలీసుల చర్యలపై స్వతంత్ర విచారణ చేపట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కోర్టు సూచించింది. అలాగే నిరసనల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలు, ప్రోటోకాల్ అవసరమని అభిప్రాయపడింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు కొన్ని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Rajya Sabha passes the Vande Mataram Protection Bill

Vande Mataram Protection Bill | రాజ్యసభలో ‘వందేమాతరం’ బిల్లు పాస్.. ఇక మారనున్న...

Vande Mataram Protection Bill: 'వందేమాతరం' గేయానికి మరింత చట్టపరమైన రక్షణ కల్పించే ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ గేయాన్ని అవమానించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది....
- Advertisement -
Chat on WhatsApp