Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeNationalNarendra Modi | ఇన్‌స్టాగ్రామ్‌లో మోడీ హవా.. 24 గంటల్లో 30.3 కోట్ల వ్యూస్!

Narendra Modi | ఇన్‌స్టాగ్రామ్‌లో మోడీ హవా.. 24 గంటల్లో 30.3 కోట్ల వ్యూస్!

-

Chat on WhatsApp

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా నిలిచారు. 2026 నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో(Selfie Video)కు అనూహ్య స్పందన లభించింది. జెన్-జీ శైలిలో రూపొందించిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలైన తొలి 24 గంటల్లోనే 303 మిలియన్‌లకు పైగా వ్యూస్ సాధించినట్లు వెల్లడైంది. ఇదే సమయంలో మోడీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరినట్లు సమాచారం.

ఈ వ్యూస్‌తో గతంలో 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ప్రముఖ స్ట్రీమర్ ఐషో స్పీడ్ వీడియో సాధించిన 300 మిలియన్ వ్యూస్ రికార్డును మోడీ వీడియో అధిగమించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 100 మిలియన్‌లకు పైగా ఫాలోవర్లతో ప్రపంచ నాయకుల్లో అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన నేతగా మోదీ కొనసాగుతున్నారు.

వీడియోలో “ఫ్రెండ్స్” అంటూ యువతకు దగ్గరయ్యే భాషలో మాట్లాడటం నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో అదే వీడియో ఆధారంగా వేలాది మంది రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ వీడియోలో వివరించిన మోడీ, స్పందించిన విద్యార్థులు, యువతకు మరో వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో మరింత అనుసంధానం పెంచేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించాలని కేంద్ర మంత్రులకు కూడా ఆయన సూచించినట్లు సమాచారం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Microsoft CEO Satya Nadella speaking about artificial intelligence and future jobs

Satya Nadella | జాబ్స్ కాదు.. అవకాశాలు పెంచడమే ఏఐ లక్ష్యం: సత్య నాదెళ్ల

Satya Nadella: కృత్రిమ మేధస్సు(AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏఐ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన ప్రజల్లో పెరుగుతోందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య...
- Advertisement -
Chat on WhatsApp