Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeNationalSatya Nadella | జాబ్స్ కాదు.. అవకాశాలు పెంచడమే ఏఐ లక్ష్యం: సత్య నాదెళ్ల

Satya Nadella | జాబ్స్ కాదు.. అవకాశాలు పెంచడమే ఏఐ లక్ష్యం: సత్య నాదెళ్ల

-

Chat on WhatsApp

Satya Nadella: కృత్రిమ మేధస్సు(AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏఐ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన ప్రజల్లో పెరుగుతోందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఏఐపై నమ్మకం తగ్గడానికి ప్రధాన కారణం సాంకేతికతపై వ్యతిరేకత కాదని, ఉద్యోగ భద్రతపై ఉన్న భయమేనని ఆయన స్పష్టం చేశారు. ఏఐను చూసే విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నాదెళ్ల పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది ఈ టెక్నాలజీని అవకాశంగా కాకుండా ముప్పుగా చూస్తున్నారని, అందుకే విశ్వాసం తగ్గుతోందని చెప్పారు.

విద్యాసంస్థల్లో ఏఐపై చర్చలు జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు ప్రతికూల స్పందనలు రావడం దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత టెక్‌ సంస్థలపై ఉందని నాదెళ్ల తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు, పన్నుల ఆదాయం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి ప్రయోజనాలు ఎలా అందుతాయో వివరించాల్సి ఉందన్నారు. ఏఐ లక్ష్యం మనుషుల ఉద్యోగాలను తొలగించడం కాదని, కొత్త అవకాశాలను సృష్టించే సాధనంగా ఉపయోగపడాలని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో అవసరమయ్యే కొత్త ఉద్యోగాలను గుర్తించడం, వాటికి తగిన నైపుణ్యాలు, వేతనాల రూపకల్పనలో కూడా ఏఐ కీలక పాత్ర పోషించగలదని సత్య నాదెళ్ల తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Flood water accumulated at Ahmedabad airport runway after heavy rainfall

Heavy Rainfall  | వర్ష బీభత్సం.. నీట మునిగిన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్

Heavy Rainfall: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. కుండపోత వానల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరడంతో పరిస్థితి...
- Advertisement -
Chat on WhatsApp