Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeNationalNarendra Modi | పేపర్ లీక్ మాఫియాకు కౌంట్‌డౌన్.. కొత్త చట్టంపై మోడీ సర్కార్ కీలక...

Narendra Modi | పేపర్ లీక్ మాఫియాకు కౌంట్‌డౌన్.. కొత్త చట్టంపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం

-

Chat on WhatsApp

Narendra Modi: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న పేపర్ లీక్ ఘటనలతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలకు రూపకల్పన చేస్తోంది. ఈ అక్రమాలను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి, ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు విడుదల చేసిన వీడియో సందేశంలో మాట్లాడిన ప్రధాని, పేపర్ లీక్‌లు లక్షలాది మంది యువత భవిష్యత్తును ప్రభావితం చేసే తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ప్రధాని, పరీక్ష రద్దు కారణంగా నష్టపోయిన 22 లక్షల మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి, ఫలితాలను కూడా విడుదల చేసినట్లు గుర్తు చేశారు.

ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విచారణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన శిక్షలు అమలయ్యేలా చట్టాన్ని బలోపేతం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు కూడా పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. మరోవైపు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నరేశ్ పాల్ గంగ్వార్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవలి పేపర్ లీక్ ఘటనలతో దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం వరుస చర్యలు చేపడుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp