Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeNationalSonam Wangchuk | నిరాహార దీక్ష విరమించిన వాంగ్‌చుక్.. కేంద్రం హామీ, ఇచ్చిన హామీలు ఏంటి?

Sonam Wangchuk | నిరాహార దీక్ష విరమించిన వాంగ్‌చుక్.. కేంద్రం హామీ, ఇచ్చిన హామీలు ఏంటి?

-

Chat on WhatsApp

Sonam Wangchuk: ప్రఖ్యాత విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కలిసి మాట్లాడారు. విద్యార్థుల సమస్యలు, ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు సంబంధించిన ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని హామీ ఇవ్వడంతో వాంగ్‌చుక్ తన దీక్షను ముగించినట్లు వెల్లడించారు.

ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని నాయకులు స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి భంగం కలగకుండా అన్ని చర్యలు చేపడతామని వారు భరోసా ఇచ్చారు. యువత సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు అవసరమైన మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు.

యువత ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ప్రధాని మోడీ సందేశాన్ని మరోసారి గుర్తు చేశారు. దేశ అభివృద్ధిలో యువత కీలక శక్తి అని, వారి భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nadendla Manohar addressing Janasena party leaders and workers

Nadendla Manohar | పార్టీ ఎదుగుదలే లక్ష్యం.. పదవుల కోసం తొందర వద్దన్న మంత్రి...

Janasena: పార్టీలో ఐక్యత, సమన్వయం ఎంతో అవసరమని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌(Nadendla Manohar) పేర్కొన్నారు. పొత్తులో భాగంగా రాజకీయ ప్రయాణం కొనసాగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఒకేసారి...
- Advertisement -
Chat on WhatsApp