Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeSportsIND vs ZIM | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా, అరంగేట్రం ఏవేరంటే ?

IND vs ZIM | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా, అరంగేట్రం ఏవేరంటే ?

-

Chat on WhatsApp

IND vs ZIM: వరుస సిరీస్‌ల పరాజయాల తర్వాత గెలుపు బాట పట్టాలని లక్ష్యంగా టీమిండియా జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను ప్రారంభించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌ల చేతిలో వైట్‌వాష్ ఎదుర్కొన్న భారత్ ఈ సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌తో ఆత్మవిశ్వాసం తిరిగి పొందాలని భావిస్తోంది. కెప్టెన్‌గా ఇప్పటివరకు విజయాన్ని అందుకోలేకపోయిన అయ్యర్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది.

ఈ మ్యాచ్‌తో భారత యువ పేసర్ అశోక్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో భారీ ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే వంటి బ్యాటర్లు జట్టుకు బలంగా నిలవాలని భావిస్తుండగా, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లతో కూడిన బౌలింగ్ దళం జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేయడంపై దృష్టి పెట్టింది. సికిందర్ రజా నాయకత్వంలోని జింబాబ్వే స్వదేశంలో పోరాట పటిమ కనబరిచి భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా బరిలోకి దిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం ఎవరు చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu

Amaravati | చంద్రబాబు విజన్‌కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్

Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో "క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్" ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్...
- Advertisement -
Chat on WhatsApp