Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshNara Lokesh | ఊహించని సర్‌ప్రైజ్.. చిన్నారి సెల్ఫీలోకి ఎంట్రీ ఇచ్చిన నారా లోకేశ్!

Nara Lokesh | ఊహించని సర్‌ప్రైజ్.. చిన్నారి సెల్ఫీలోకి ఎంట్రీ ఇచ్చిన నారా లోకేశ్!

-

Chat on WhatsApp

Nara Lokesh: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన మంగళగిరి రైల్వే స్టేషన్ పునఃప్రారంభ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శన కోసం సిద్ధమవుతున్న ఓ చిన్నారి తన మొబైల్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా, అది గమనించిన లోకేశ్ సరదాగా ఆమె పక్కకు వెళ్లి కెమెరాకు పోజిచ్చారు.

ఊహించని విధంగా మంత్రి తన సెల్ఫీలో కనిపించడంతో ఆ చిన్నారి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. అనంతరం ఫొటో చూసుకుని ఆనందంతో చిరునవ్వులు చిందించింది. అక్కడ ఉన్నవారు కూడా ఈ ఆప్యాయ క్షణాన్ని ఆసక్తిగా వీక్షించారు. చిన్నారులతో లోకేశ్ మమేకమైన తీరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మధుర సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Rohit Sharma

BCCI | రోహిత్ రిటైర్మెంట్ వార్తలకు బీసీసీఐ చెక్.. లార్డ్స్ మ్యాచ్‌పై క్లారిటీ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ(BCCI) తెరదించింది. ఆదివారం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా...
- Advertisement -
Chat on WhatsApp