Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshTirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్.. అనంతరం టీడీపీ నేత ఇంటికి

Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్.. అనంతరం టీడీపీ నేత ఇంటికి

-

Chat on WhatsApp

Tirumala: తిరుమల శ్రీవారిని గురువారం మంత్రి నారా లోకేశ్ దర్శించుకుని ఆశీస్సులు పొందారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన నారా లోకేశ్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. తిరుమల పర్యటన అనంతరం లోకేశ్ తిరుపతిలోని భూపాల్ హౌసింగ్ కాలనీకి వెళ్లి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కే. గౌతమి శ్వేత నివాసాన్ని సందర్శించారు. అక్కడ ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతల నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

bogatha waterfall in mulugu district overflowing with heavy water flow during rainy season

Bogatha waterfall | పరవళ్లు తొక్కుతున్న బొగత వాటర్‌ఫాల్స్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు

Bogatha waterfall: ములుగు జిల్లా వాజేడు మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం బొగత జలపాతం ఈ సీజన్‌లో మరింత అందంగా మారింది. ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల...
- Advertisement -
Chat on WhatsApp