Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeInterNationalBirthright Citizenship | ట్రంప్‌కు షాక్.. అమెరికాలో పుట్టిన పిల్లల పౌరసత్వంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు,...

Birthright Citizenship | ట్రంప్‌కు షాక్.. అమెరికాలో పుట్టిన పిల్లల పౌరసత్వంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, భారతీయులకు ఊరట

-

Chat on WhatsApp

Birthright Citizenship: అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం కల్పించే ‘బర్త్‌రైట్ సిటిజన్‌షిప్’ నిబంధనపై కొనసాగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు న్యాయపరమైన సవాళ్లు ఎదురవడంతో, అమెరికా సుప్రీంకోర్టు ఈ అంశంపై కీలక నిర్ణయం వెలువరించింది. ఈ పరిణామం ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబాలకు ఊరట లభించింది. 

దశాబ్దాలుగా అమల్లో ఉన్న 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం, అమెరికాలో జన్మించిన శిశువుకు సాధారణంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధన దశాబ్దాలుగా అమల్లో ఉండటంతో విదేశాల నుంచి ఉద్యోగాలు, ఉన్నత విద్య లేదా ఇతర వీసాలపై అమెరికాలో నివసిస్తున్న కుటుంబాలకు ఇది కీలకమైన చట్టపరమైన రక్షణగా భావిస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు H-1B, విద్యార్థి, ఉద్యోగ, గ్రీన్ కార్డ్ తదితర వీసాలపై నివసిస్తున్నారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల వీసా హోదా ఏదైనా కావొచ్చు, అమెరికాలో జన్మించిన శిశువుకు సాధారణంగా అమెరికా పౌరసత్వం వర్తిస్తుంది. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసలను నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రయత్నించింది.

తాత్కాలిక వీసాలపై ఉన్నవారికి లేదా అక్రమంగా నివసిస్తున్నవారికి పుట్టే పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం ఇవ్వకుండా పరిమితులు విధించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. అయితే ఈ అంశంపై కోర్టు జోక్యంతో అధ్యక్షుడి ఉత్తర్వుల అమలుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరసత్వ నిబంధనలపై వెంటనే ప్రభావం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న విదేశీ కుటుంబాలతో పాటు భారతీయులకు కూడా ఉపశమనంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ap eapcet 2026 results announced by minister nara lokesh

AP EAPCET 2026 ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే

AP EAPCET Results 2026 Out: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET 2026 పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...
- Advertisement -
Chat on WhatsApp