Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTRavi Teja | రవితేజ ‘ఇరుముడి’ నుంచి కొత్త మ్యూజికల్ అప్‌డేట్… ఈసారి దద్దరిల్లిపోద్ది

Ravi Teja | రవితేజ ‘ఇరుముడి’ నుంచి కొత్త మ్యూజికల్ అప్‌డేట్… ఈసారి దద్దరిల్లిపోద్ది

-

Chat on WhatsApp

Ravi Teja: రవితేజ హీరోగా, భావోద్వేగాలను ప్రధానంగా తీసుకునే కథలతో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’పై చిత్ర పరిశ్రమలో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ దశలో కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుంది.

ముఖ్యంగా తండ్రీ–కూతురు అనుబంధం, భక్తి భావం కలగలిసిన ఎమోషనల్ టచ్ ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. రవితేజ ఇప్పటివరకు చేసిన మాస్ పాత్రలకు భిన్నంగా, ఒక భావోద్వేగ తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తన కుమార్తె కోసం వ్యసనాలను వదిలి అయ్యప్ప మాల ధరించే పాత్రలో ఆయన నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాలో అయ్యప్ప స్వామి నేపథ్యంలో రెండు ప్రత్యేక భక్తి గీతాలను కంపోజ్ చేసినట్లు సమాచారం. వీటిలో ఒకటి ఇప్పటికే ప్రేక్షకుల్లో ట్రెండ్ అవుతున్న ‘బంగారు పల్లకి’ పాట కాగా, మరో కొత్త పాట కూడా కథలో కీలక భావోద్వేగాన్ని తీసుకురానుందని టాక్. హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, దర్శకుడు శివ నిర్వాణ ఈ కథను ఎంతో హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో తెరకెక్కిస్తున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. భక్తి, ఎమోషన్, కుటుంబ సంబంధాల మేళవింపుతో రూపొందుతున్న ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Air India AI-171 crash investigation officials examining aircraft wreckage

Ahmedabad Crash Investigation | ఎయిరిండియా AI-171 ప్రమాదంపై కేంద్రం క్లారిటీ.. కేంద్రం కీలక...

Ahmedabad Crash Investigation: ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తుది...
- Advertisement -
Chat on WhatsApp