Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshChandrababu Naidu | భారతీయ సంగీతానికి అజరామర స్వర సంపద.. ఎస్పీ బాలుకు సీఎం నివాళులు

Chandrababu Naidu | భారతీయ సంగీతానికి అజరామర స్వర సంపద.. ఎస్పీ బాలుకు సీఎం నివాళులు

-

Chat on WhatsApp

Chandrababu Naidu: భారతీయ సినీ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ గాయకుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగ నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్టులో బాలు సంగీత ప్రస్థానాన్ని స్మరించుకున్నారు.

అసాధారణ గాత్ర మాధుర్యంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారతీయ సంగీత రంగానికి అమూల్యమైన సేవలు అందించారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి సంగీత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. సంగీతానికి బాలు అందించిన సేవలు, ఆయన పాడిన గీతాలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.

తెలుగు భాష, తెలుగు సంగీత చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు శాశ్వత అధ్యాయంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఆయన స్వరం కేవలం పాటలకే పరిమితం కాలేదని, లక్షలాది మంది అభిమానుల భావోద్వేగాల్లో శాశ్వతంగా భాగమైందని వ్యాఖ్యానించారు. బాలు భౌతికంగా దూరమైనప్పటికీ, ఆయన ఆలపించిన అనేక గీతాల రూపంలో ఎప్పటికీ ప్రజల మధ్య జీవిస్తూనే ఉంటారని చంద్రబాబు పేర్కొన్నారు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన అపూర్వ సేవలను దేశం ఎన్నటికీ మరచిపోదని తెలిపారు. ఈ సందర్భంగా గాన గంధర్వుడిగా గుర్తింపు పొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సీఎం మరోసారి ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Air India AI-171 crash investigation officials examining aircraft wreckage

Ahmedabad Crash Investigation | ఎయిరిండియా AI-171 ప్రమాదంపై కేంద్రం క్లారిటీ.. కేంద్రం కీలక...

Ahmedabad Crash Investigation: ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తుది...
- Advertisement -
Chat on WhatsApp