Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeSportsRishabh Pant | లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్.. సారథ్యాన్ని వదిలిన పంత్

Rishabh Pant | లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్.. సారథ్యాన్ని వదిలిన పంత్

-

Chat on WhatsApp

Rishabh Pant: ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ అంచనాలతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టులో చేరిన రిషభ్ పంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసినప్పటికీ జట్టుకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిన అతడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు.

సీజన్‌లో లక్నో జట్టు పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో, తనను కెప్టెన్‌గా తప్పించాలని స్వయంగా ఫ్రాంచైజీని కోరినట్లు సమాచారం. అతడి అభ్యర్థనను లక్నో యాజమాన్యం వెంటనే ఆమోదించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ కూడా ధృవీకరించారు. కెప్టెన్‌గా పంత్ చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

వరుసగా రెండు సీజన్లలో లక్నోను ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోవడం, ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 10 ఓటములు ఎదురవ్వడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. బ్యాటింగ్‌లో కూడా పంత్ కేవలం 312 పరుగులే చేయడం విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జట్టు భవిష్యత్ ప్రదర్శనపై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ మార్పు తీసుకున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu | పట్టిసీమ లేకుంటే కృష్ణా డెల్టా పరిస్థితి దారుణం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: రాష్ట్రంలో సాగునీటి రంగాభివృద్ధికి కేఎల్ రావు చూపిన మార్గమే ఆదర్శమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా-గోదావరి(Krishna- Godavari) సంగమ క్షేత్రంలో ప్రత్యేక పూజలు...
- Advertisement -
Chat on WhatsApp