Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTAjith Kumar Mother | అజిత్ కుమార్ ఇంట విషాదం... తల్లి మోహిని కన్నుమూత

Ajith Kumar Mother | అజిత్ కుమార్ ఇంట విషాదం… తల్లి మోహిని కన్నుమూత

-

Chat on WhatsApp

Ajith Kumar Mother: తమిళ సినీ ప్రపంచాన్ని విషాదం కమ్మేసింది. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది. ఆయన తల్లి మోహిని శనివారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. 84 ఏళ్ల మోహిని కొంతకాలంగా వృద్ధాప్యానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.

ఇదే సమయంలో అజిత్ తండ్రి పి.ఎస్. సుబ్రమణ్యం (మణి) 2023లో వృద్ధాప్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. తండ్రి మరణం తర్వాత మూడేళ్లకే తల్లి కూడా దూరమవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లి మరణ సమయంలో అజిత్ సినిమా పనుల నిమిత్తం దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. వార్త తెలిసిన వెంటనే ఆయన తీవ్ర మనోవేదనకు గురై, అత్యవసరంగా చెన్నైకి బయలుదేరినట్లు తెలుస్తోంది.

అజిత్ చెన్నై చేరుకున్న తర్వాత మోహిని అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. మోహిని మృతిపట్ల తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు, దర్శకులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా తమ ప్రియ నటుడికి మద్దతుగా సంతాప సందేశాలు పంచుకుంటున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp