Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTShiva Rajkumar | నేషనల్ అవార్డు గ్యారంటీ... శివ రాజ్‌కుమార్ ఎమోషనల్ కామెంట్స్

Shiva Rajkumar | నేషనల్ అవార్డు గ్యారంటీ… శివ రాజ్‌కుమార్ ఎమోషనల్ కామెంట్స్

-

Chat on WhatsApp

Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు రేపుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అందుకుంది. భారతీయ సినిమాలో ఇప్పటివరకు చూడని “క్రాస్ ఓవర్ అథ్లెట్” కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం, రామ్ చరణ్ రస్టిక్ మేకోవర్‌తో సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం బెంగళూరులో భారీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో ఆయన ‘గౌర్నయుడు’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్, రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినప్పటికీ సెట్స్‌లో చూపించే క్రమశిక్షణ, వినయం తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.

ఇంకా సినిమా గురించి మాట్లాడుతూ, ‘పెద్ది’లో రామ్ చరణ్ నటన అద్భుతమని, క్రాస్ ఓవర్ అథ్లెట్ పాత్రలో ఆయన చూపించిన భావోద్వేగాలు, నటనకు ఖచ్చితంగా జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉందని శివన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  శివ రాజ్‌కుమార్ ఇచ్చిన ఈ పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్‌తో ‘పెద్ది’పై అంచనాలు మరింత పెరిగాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp