Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeSportsSRH vs RCB | నేడు అసలు సిసలైన మ్యాచ్...ఎవరు గెలుస్తారో ?

SRH vs RCB | నేడు అసలు సిసలైన మ్యాచ్…ఎవరు గెలుస్తారో ?

-

Chat on WhatsApp

SRH vs RCB: ఐపీఎల్ 2026( IPL 2026) సీజన్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది.ఈ సీసన్ లో ఈరోజు చాలా కీలకమైన హైదరాబాద్ వేదికగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి.

అయితే పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఇరు జట్లు నాకౌట్ దశకు చేరుకున్నప్పటికీ, ఈ మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్ స్థానాలను తలకిందులు చేసే అవకాశం లేకపోలేదు. భారీ రన్ రేట్‌తో విజయం సాధిస్తే SRH రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది.

అదే సమయంలో RCB గెలిస్తే రెండు జట్లు తమ ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సొంత మైదానంలో ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానుల మద్దతుతో బలంగా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో SRH ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక RCB కూడా ప్లేఆఫ్స్ రేసులో తన స్థానాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. హై-వోల్టేజ్ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

revanth reddy meets godrej agrovet officials over khammam oil palm project

Godrej Agrovet | ఆయిల్ పామ్ రంగంలో భారీ పెట్టుబడి.. ఖమ్మంలో ₹300 కోట్ల...

Godrej Agrovet: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ....
- Advertisement -
Chat on WhatsApp