ఇండియన్ చలన చిత్రంలో అత్యంత విజయవంతమైన ఉత్కంఠభరిత సినిమాల సిరీస్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన ‘దృశ్యం(Drishyam)’ సిరీస్ మూడో భాగం ‘దృశ్యం 3’(Drishyam 3)పై ప్రేక్షకుల్లో సినిమా విడుదలకు ముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలను నెలకొల్పుతుంది.
ఈ నేపథ్యంలో ‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన కీలక సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్‌పై ఆంటోనీ పెరుంబావూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అన్ని డిజిటల్ ఫార్మాట్ల హక్కులు తమ వద్దే ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో సినిమా విడుదల కాకముందే ఓటీటీ డీల్ పై పెద్ద చర్చ మొదలైంది
‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్న అపారమైన ఆదరణను దృష్టిలో పెట్టుకుని, భారీ మొత్తాన్ని చెల్లించి అమెజాన్ ప్రైమ్ ఈ హక్కులను దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘దృశ్యం 1’, ‘దృశ్యం 2’ చిత్రాలు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండగా, వాటికి వచ్చిన భారీ వ్యూస్ ఈ ఒప్పందానికి కారణమని చెబుతున్నారు.
దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ మరోసారి తన ఐకానిక్ పాత్ర ‘జార్జ్‌కుట్టి’గా కనిపించనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం థియేటర్ రన్ పూర్తైన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది.
సాధారణంగా 30 నుంచి 35 రోజుల థియేటర్ విండో తర్వాత డిజిటల్ రిలీజ్ ఉండే అవకాశముంది. ఉత్కంఠభరిత కథనం, క్లైమాక్స్‌పై ఉన్న ఆసక్తితో ‘దృశ్యం 3’పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.








