Medak Fire Accident: మెదక్ జిల్లాలోని తూప్రాన్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ లారీలో తరలిస్తున్న 8 కొత్త కార్లు ఒక్కసారిగా మంటలు చల రేగడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం ప్రకారం, కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్‌లో కొత్తగా తయారైన కార్లు ఉన్నాయి. తూప్రాన్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే పరిస్థితి అదుపు తప్పింది.
మొత్తం ఎనిమిది కొత్త మారుతీ కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








