Peddi Movie Trailer: పెద్ది(Peddi) ట్రైలర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిగా మాస్ అవతారంలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా విభిన్న పాత్రల్లో చరణ్ చూపించిన ఎనర్జీ ట్రైలర్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. “ఆటే నా పొగరు… నేను ఆడాననుకున్నారా సారు, పోరాడాను” వంటి డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. ట్రైలర్‌లో జాన్వీ కాపూర్(Janhvi Kapoor) లుక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె పాత్రకు సంబంధించిన మాస్ టచ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండగా, ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. యాక్షన్, ఎమోషన్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కలయికతో ‘పెద్ది’ ప్రేక్షకులకు పవర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని చిత్రబృందం భావిస్తోంది.
ALSO READ:విద్యార్థులకు గుడ్ న్యూస్…AP LAWCET 2026 Results Out








