Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTఆవేశం వద్దు...సినిమాటోగ్రాఫి నియామకం పై స్పందించిన రాఘవ లారెన్స్

ఆవేశం వద్దు…సినిమాటోగ్రాఫి నియామకం పై స్పందించిన రాఘవ లారెన్స్

-

Chat on WhatsApp

Raghava Lawrence: సీఎం విజయ్ తన కొత్త క్యాబినెట్‌లో రాజ్ మోహన్‌(Raj Mohan)ను ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫ్ చట్టం శాఖ మంత్రిగా నియమించిన విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే చిత్ర పరిశ్రమపై పూర్తి అవగాహన, సీనియారిటీ లేని వ్యక్తికి కీలక శాఖ ఇవ్వడంపై సినీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తీవ్ర ట్రోల్స్ కూడా కనిపించాయి.

ఈ వివాదంపై నటుడు రాఘవ లారెన్స్ స్పందించారు. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వెనుక భవిష్యత్ ప్రణాళికలు ఉండొచ్చని, ఆవేశంగా స్పందించవద్దని సినీ పరిశ్రమకు సూచించారు. కొత్త మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్ మోహన్ పరిశ్రమ అభివృద్ధి, సినీ కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఇటీవల సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా విజయ్ నాయకత్వాన్ని ప్రశంసించిన విషయం తెలిసిందే. ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి లెజెండ్స్ స్థాయిలో విజయ్ నిర్ణయాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో లారెన్స్ మద్దతు కూడా చేరడంతో కోలీవుడ్‌లో కొత్త రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

విజయ్ తీసుకుంటున్న కొత్త క్యాబినెట్ నిర్ణయాలు, సినీ పరిశ్రమకు సంబంధించిన పాలసీలు భవిష్యత్తులో కోలీవుడ్ దిశను ఎలా మార్చుతాయన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ:Telangana government | లబ్ధిదారులకు శుభవార్త…జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు ప్రారంభం


- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian Government | చిన్నారుల భద్రతపై కేంద్రం సీరియస్.. ఇన్‌స్టాగ్రామ్‌కు నోటీసులు జారీ

Indian Government: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ...
- Advertisement -
Chat on WhatsApp