Gold and silver prices: దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఒక్కసారిగా పెరిగిన ధరలు ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి. మే 18న నమోదైన తాజా ధరల ప్రకారం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,920గా నమోదైంది.
అయితే రోజంతా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,920 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,840గా ఉంది. విజయవాడ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,070గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,990గా నమోదైంది.
ఇక చెన్నైలో మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,090 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,490గా కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా కొంత మేర తగ్గాయి. హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,89,900గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,79,900గా నమోదైంది. ధరలు తగ్గడంతో బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తి పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.








