HomeAndhra PradeshAP SSC Results 2026 | ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా ఉత్తీర్ణత...

AP SSC Results 2026 | ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా ఉత్తీర్ణత శాతం ఎంతంటే ?

-

Chat on WhatsApp

AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో 2026 మార్చి ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) పరీక్షల ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ సేవ ‘మన మిత్ర’, లీప్ మొబైల్ యాప్, డిజిలాకర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. పాఠశాల హెడ్‌మాస్టర్ల లాగిన్‌లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఏడాది ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25%గా నమోదవగా, గత ఏడాది 81.14%తో పోలిస్తే స్పష్టమైన పెరుగుదల ఉంది. అమ్మాయిలు ఈసారి అబ్బాయిల కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 87.90% కాగా, అబ్బాయిలది 82.68%గా నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు కూడా మెరుగుపడి, 72.8% నుంచి 78.39%కు పెరిగాయి.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. మంత్రి లోకేష్ విజయవంతమైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ, ఫెయిల్ అయిన వారు నిరుత్సాహపడవద్దని సూచించారు. కుటుంబం, ఉపాధ్యాయుల సహకారంతో మరింత బలంగా తిరిగి రావాలని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుకు విద్యార్థులే బలం అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp