Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAnudeep Katikala | పోలీసుల అదుపులో స్టాండప్ కమెడియన్

Anudeep Katikala | పోలీసుల అదుపులో స్టాండప్ కమెడియన్

-

Chat on WhatsApp

Anudeep Katikala: హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల అరెస్ట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు.

అనుదీప్ తన కామెడీ షోలలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, వివాహాలు మరియు విడాకుల అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది.

జనసేన పార్టీకి చెందిన నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు మేరకు కాకినాడ I-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పరువు నష్టం, తప్పుడు సమాచారం వ్యాప్తి, మహిళల గౌరవానికి భంగం కలిగించడం వంటి ఆరోపణలతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుటుంబంతో ఉన్న అనుదీప్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను కాకినాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.



ఇక అనుదీప్ ఇప్పటికే తన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరచాలనే ఉద్దేశం లేదని, సమాజంలో విడాకులపై ఉన్న అభిప్రాయాలను ప్రశ్నించే క్రమంలో వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ వివాదం తీవ్రత దృష్ట్యా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Landslide hit a Tata Sumo in Himachal Pradesh's Lahaul-Spiti district.

Himachal Pradesh | హిమాచల్‌లో ప్రకృతి బీభత్సం.. టాక్సీపై విరిగిపడ్డ కొండచరియలు, పలువురు మృతి

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం లాహౌల్-స్పితిలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో టాటా సుమో టాక్సీ శిథిలాల కింద చిక్కుకుంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఉదయ్‌పూర్-కిలార్...
- Advertisement -
Chat on WhatsApp